ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ap news today

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Jul 13, 2022, 8:58 AM IST

  • Damaged roads: తీరు తెన్ను లేని దారి.. మోక్షమెప్పుడో మరి
    Damaged roads: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట నుంచి తాపేశ్వరం మీదుగా ద్వారపూడి వెళ్లే మార్గం.. అధ్వాహ్నంగా మారింది. గతేడాదే రూ.50లక్షలు వెచ్చించి ఈ రోడ్డును బాగు చేశారు. అయినప్పటికీ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయంటే.. పనులు ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సాంకేతిక లోపంతో సొమ్ము ఉపసంహరణ... ప్రభుత్వం అఫిడవిట్​
    ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ సాంకేతికలోపం కారణంగానే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఉపసంహరించిన నగదును ఇతర అవసరాలకు మళ్లించలేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉప్పొంగుతున్న నదులు, కాలువలు.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
    రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఒడిశా తీరప్రాంతం, పరిసరాల్లో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముసురు వాతావరణం వీడలేదు. మంగళవారం ఉదయంనుంచి కోస్తాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Protest: నేటి నుంచి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆందోళన
    Protest: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పునర్‌వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న అధికారాల వికేంద్రీకరణ, పారదర్శకత లేని బదిలీల తీరును ఖండిస్తున్నట్లు.. రాష్ట్ర కమర్షియల్‌ టాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • శ్రీలంక విడిచి పారిపోయిన గొటబాయ.. ఆ దేశంలో స్వాగతం
    Gotabaya rajapaksa news: శ్రీలంకలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్​కు పరారయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • జనాభాలో అగ్రస్థానం వైపు భారత్‌.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కేనా?
    ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న కృషి ఫలించేలా ఉందని ఐరాసలో కీలక స్థానంలో ఉన్న అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా మరో ఏడాదిలోనే భారత్‌ నిలువనుందని ఐరాస నివేదిక నేపథ్యంలో ఇది మరింత బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ దేశాలు ఊ అంటే రూపాయల్లోనే వ్యాపారం.. భారత్​కు మేలు!
    రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక ప్రతిపాదన చేసింది. రష్యా సహా పొరుగు దేశాలతో రూపాయల్లో వ్యాపారం జరిపేలా పావులు కదుపుతోంది. ఈ దేశాలు అంగీకరిస్తే ప్రస్తుతం భారత్​ చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకోవచ్చు. దీని వల్ల డాలర్‌తో పోలిస్తే 79.59కు పతనమైన రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టీమ్​ఇండియాకు పాక్​ మాజీ కెప్టెన్​ వార్నింగ్​.. అలా చేయొద్దంటూ..
    Pak cricketer Rashid latif on Teamindia: టీమ్‌ఇండియాను పాక్​ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్​ హెచ్చరించాడు. భారత జట్టు వ్యూహాలు మరీ అతిగా ఉన్నాయని అన్నాడు. వాటిని కొనసాగిస్తే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మహేశ్​-త్రివిక్రమ్​ మూవీ.. కథ ఇదేనటా?
    Mahesh Trivikram movie story: మహేశ్​బాబు-త్రివిక్రమ్​ కాంబోలో రానున్న సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో పాటుగా తనదైన యాక్షన్‌శైలి, డ్రామాను అన్వయించి సరికొత్త కథను త్రివిక్రమ్​ సిద్ధం చేశారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details