ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7AM - ఏపీ న్యూస్

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Jul 13, 2022, 6:58 AM IST

  • ఉప్పొంగుతున్న నదులు, కాలువలు.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
    రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఒడిశా తీరప్రాంతం, పరిసరాల్లో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముసురు వాతావరణం వీడలేదు. మంగళవారం ఉదయంనుంచి కోస్తాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉచిత పంటల బీమా పథకంలోకి.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన
    రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అమలు చేయనున్నాయి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కలిపి అమలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మద్యం రాబడి హామీగా చూపి.. రుణ సమీకరణకు ప్రభుత్వ యత్నం !
    అందినకాడికి అప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. కొత్త రుణాల కోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. మద్యం రాబడిని ఆదాయంగా చూపించి ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్ ద్వారా 25వేల కోట్లు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి మరీ కార్పొరేషన్ ఆదాయం పెంచేలా నిబంధనలు సైతం మార్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కోనసీమ జిల్లాలో వింత ఘటన.. భూమిలో నుంచి వేడి ఆవిర్లు
    Hot vapors from the ground: కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భారీవర్షాలకు నేల తడిసిముద్దవుతుంటే ఆ ఇంటి ఆవరణం మాత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. మరోవైపు నేల నుంచి వేడి ఆవిరి బయటకు వస్తోంది. ఈ వింతను తిలకించేందుకు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పానీపూరి చేసి పెట్టిన సీఎం- టూరిస్టులు ఫిదా
    Mamata Makes Panupuri: కొందరు పర్యటకులకు అరుదైన అవకాశం దక్కింది. డార్జిలింగ్​కు పర్యటనకు వెళ్లిన వారిలో కొందరికి స్వయంగా పానీపూరి చేసి వడ్డించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కోట్ల విలువైన హెరాయిన్​ సీజ్​.. మళ్లీ ముంద్రా పోర్ట్​ దగ్గరే!
    Heroin Seize Mundra port: గుజరాత్​ ముంద్రా ఓడరేవు సమీపంలో.. భారీగా హెరాయిన్​ పట్టుబడింది. రూ.376.50 కోట్ల విలువైన సుమారు 75 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇరాన్​కు పుతిన్​.. ఆ అధునాతన డ్రోన్ల కోసమే.. ఉక్రెయిన్​కు ఇక కష్టమే!
    Iran Drones To Russia: ఉక్రెయిన్​పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ వచ్చే వారం ఇరాన్​ వెళ్లనున్నారు. ఇరాన్​ నుంచి రష్యా మానవరహిత డ్రోన్ల సాయం కోరిందని అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పుతిన్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • గడువులోగా ఐటీఆర్​ ఫైల్​ చేస్తే లాభాలెన్నో!
    ఐటీఆర్​ దాఖలుకు చివరి తేదీ జులై 31. ఆఖరి నిమిషం వరకు వేచిచూడకుండా ఆ పని ముందే పూర్తి చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బుమ్రా, రోహిత్ సూపర్​ షో.. తొలి వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్​ రికార్డు విజయం
    తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా వికెట్‌ నష్టపోకుండా పూర్తి చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76 నాటౌట్​), శిఖర్ ధావన్‌ (31 నాటౌట్​) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచి విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నాగచైతన్య 'థ్యాంక్‌ యూ' ట్రైలర్ రిలీజ్​.. నయనతార 75వ చిత్రం ఖరారు
    నాగచైతన్య హీరోగా నటించిన 'థ్యాంక్‌ యూ' సినిమా ట్రైలర్​ విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో ఆమె 75వ చిత్రం ఖరారైంది. ఈ సినిమాల అప్డేట్స్​ మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details