ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ap latest updatess

.

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Jul 6, 2021, 9:04 PM IST

Updated : Jul 6, 2021, 9:11 PM IST

  • విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి

విశాఖ జిల్లాలోని అనకాపల్లి వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్‌ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్​లో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కొవిడ్ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

కొవిడ్ మూడో వేవ్​ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కరోనా వైరస్​తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన సీఎం వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి అయ్యేంతవరకూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నెల 9 తేదీ నుంచి 23 తేదీ వరకూ రైతు చైతన్య యాత్రలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల నుంచి మరో 200 పౌరసేవలు అందించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కొవిడ్ తగ్గుముఖం పడితే తాను కూడా వారానికి రెండు సచివాలయాల సందర్శిస్తానన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • water disputes: 'ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయండి'

ఇరు రాష్ట్రాల నీటి వివాదంపై.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తేలేవరకు.. సయోధ్య కుదిరే వరకు.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేలా చూడాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • kambhampati: మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: కంభంపాటి

దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు.. మిజోరాం గవర్నర్​గా(mizoram governer) నియమితులయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపే మంత్రివర్గ విస్తరణ- 22 మంది కొత్తవారు!

కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అదే సమయంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జేఈఈ మెయిన్స్​ కొత్త తేదీలివే..

ఇంజినీరింగ్​లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి..​ కొత్త తేదీలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. జులై 20- 25 వరకు మూడో​ ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సోనియాతో సీఎం భేటీ- కారణమదేనా?

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని దిల్లీలోని ఆమె నివాసంలో కలిశారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విబేధాల నేపథ్యంలో అమరీందర్ సోనియాను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత ప్రయాణికులపై ఆంక్షలు సడలింపు

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ ఆంక్షలను సడలించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితా నుంచి భారత్​ను తొలగించాలని నిర్ణయించింది. తద్వారా వ్యాక్సినేషన్ పూర్తైన వారికి.. క్వారంటైన్ నుంచి మినహాయింపు లభించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • IND VS SL: హార్దిక్ బౌలింగ్​పై వారిదే నిర్ణయం

శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్​ యాదవ్​.. కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక పర్యటన నిర్వహించడం గొప్ప విశేషమని, అది తమకు మంచి అవకాశమని అన్నాడు. దీంతోపాటు హార్దిక్​ బౌలింగ్​ చేసే విషయమై స్పందించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Ajay Devgan: ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన 'భుజ్​'


1971లో భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంతో రూపొందిన చిత్రం 'భుజ్​​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా'(Bhuj: The Pride of India). అజయ్​ దేవగణ్​(Ajay Devgan), సంజయ్​ దత్​(Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Jul 6, 2021, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details