ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 pm - ap news

.

ప్రధాన వార్తలు @ 7 pm
ప్రధాన వార్తలు @ 7 pm

By

Published : Jun 9, 2021, 7:01 PM IST

  • Ap Corona Cases: కొత్తగా 8,766 కేసులు, 67 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 8,766 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరో 67 మంది మృతిచెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!

కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైఎస్సార్‌ బీమా (YSR Bima)లో రాష్ట్ర ప్రభుత్వం(ap govt) మార్పులు చేసింది. క్లెయిమ్​ల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే సహాయం చేస్తుందని సీఎం జగన్ (cm jagan) ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Junior Doctors : త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు : జూడాలు

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారిస్తామని చెప్పినట్లు జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ వైద్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాము సమ్మె విరమించామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ చొరవ.. నెరవేరనున్న తెలంగాణ హైకోర్టు కల

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీరమణ(CJI NV Ramana) చొరవతో తెలంగాణ హైకోర్టు చిరకాలవాంఛ నెరవేరనుంది. గత రెండేళ్లుగా హైకోర్టు చేస్తున్న విజ్ఞప్తికి సీజేఐ ఆమోదం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు'

కరోనా కష్టకాలంలో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేలా మోదీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు లేక ఉద్యోగులు కానీ కరోనా బారిన పడితే ప్రత్యేక సెలవులను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పీవీ సన్నిహితుడు రామ్ ఖండేకర్​ మృతి

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుపొందిన రామ్ ఖండేకర్​ కన్నుమూశారు. పీవీతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా చాలా కాలంపాటు పని చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహిళకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ మహిళ. ఏడు నెలల ఏడు రోజుల గర్భవతి అయిన ఆమెకు సిజేరియన్ నిర్వహించి ప్రసవం చేశారు వైద్యులు. ఇంత మంది పుడతారని తాము ఊహించలేదని భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ENG vs NZ: విలియమ్సన్​ ఔట్​.. లాథమ్​కు​ పగ్గాలు

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు నుంచి కివీస్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడు. కేన్​ స్థానంలో లాథమ్​ జట్టును నడిపించనున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దిల్​రాజు దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ

కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీకార్మికులకు తన వంతుగా సాయం చేశారు ప్రముఖ నిర్మాత దిల్​రాజు. 'కళామ్మతల్లి చేదోడు' కార్యక్రమం ద్వారా 600 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details