- కుటుంబ సభ్యులే ముందుకు రావట్లేదు
కరోనా మృతుల ఖననానికి కుటుంబసభ్యులే ముందుకు రాని దయనీయ స్థితి నెలకొందని... అయితే అంత్యక్రియలు గౌరవప్రదంగా, ప్రోటోకాల్ ప్రకారం జరగాలని సీఎం ఆదేశించినట్టు కొవిడ్ కంట్రోల్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఎక్స్‌రే కోసం స్ట్రెచర్‌పై
కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన కర్నూలులో జరిగింది. ఆస్పత్రిలో చేరిన వృద్ధుడిని ఎక్స్‌రే కోసం బయటికి పంపించటం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!
కరోనా బారినపడి ఓ జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్‌తో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కన్నుమూశారు. మధుసూధన్ రెడ్డికి గతవారం కరోనా వైరస్ నిర్ధరణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ అమలైనట్లే
రాష్ట్రంలో కొవిడ్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినట్లేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అంతేకానీ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకమే అమలు కానప్పుడు.. అందులో ఎన్ని రోగాలు చేర్చి ఏం ప్రయోజనమంటూ విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రతి 10 లక్షల జనాభాకు 727 కరోనా కేసులు
దేశంలో ప్రతి పది లక్షల మందికి 727 కరోనా కేసులే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే 4-8 రెట్లు తక్కువేనని తెలిపింది. కరోనాతో దేశంలో 10 లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని... అది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి