లోపాలే ముంచాయి
అస్తవ్యస్త మరమ్మతులతో స్టైరీన్ ట్యాంకులోని వ్యవస్థలను దెబ్బతీశారు. ప్రమాద సంకేతాలు ముందుగానే వెలువడినా పట్టనట్లు వ్యవహరించారు. లాక్‌డౌన్ వేళ అత్యంత ప్రమాదకర ట్యాంకుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విశాఖ వాయు విషాదానికి ప్రధాన కారణాలుగా హై పవర్ కమిటీ నిగ్గు తేల్చిన అంశాలివి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వేగం పెంచండి
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు-నేడు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెండు, మూడో దశ పనులూ సకాలంలో చేపట్టేలా చూడాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పగ్గాల్లేని కరోనా
రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇవాళ తాజాగా 1,322 మందికి కోవిడ్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలపి 20 వేల 19 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల్లో 1,263 మంది రాష్ట్రవాసులు ఉన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నగ్నదృశ్యాల కేసులో మరో మలుపు
గుంటూరు యువతిపై లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గాలి ద్వారా కరోనా రాదు
కరోనా వైరస్ వేగంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఇంతలా మహమ్మారి వ్యాపించటానికి గల కారణాలు ఇప్పటికి తెలియలేదు. అయితే ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వార్త ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా గాలి ద్వారా వ్యాపించదని తెలిపారు సెంట్రల్ సైన్స్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.