ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@ 3PM - top news in andhrapradesh

.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-December-2021/13923305_3pm.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-December-2021/13923305_3pm.jpg

By

Published : Dec 16, 2021, 3:00 PM IST

Updated : Dec 16, 2021, 3:10 PM IST

  • Cinema Tickets Issue: సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..ఏంటంటే..!

రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమానులు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని ఆదేశించింది. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • Employees on Fitment: ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాల నాయకులు

Govt Employees on Fitment: తమకు ఇచ్చే బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోందని ఉద్యోగ సంఘాల జేఏసి నేతలు ఆరోపించారు. ప్రభుత్వం తమపై వేలకోట్ల ఖర్చు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • Lokesh On HSBC: 3 రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి - లోకేశ్‌

Lokesh On HSBC: రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ళ నుంచి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ మూతపడటం బాధాకరమన్నారు. 3 రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు అన్న లోకేష్ విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • 'మంచి గుడ్లు ఇవ్వలేని ప్రభుత్వం.. గుడ్ గవర్నెన్స్ ఇస్తుందా?'

SOMU VEERRAJU LETTER TO CM JAGAN ON QUALITYLESS FOOD నాణ్యమైన గుడ్లు సరఫరా చేయలేని రాష్ట్ర ప్రభుత్వం.. గుడ్ గవర్నెన్స్​ను ఏం ఇవ్వగలదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ. పౌష్టికాహారం అందించడంలో కనీస పర్యవేక్షణ చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • హెచ్​ఏఎల్​, బీఈఎల్​ మధ్య​ రూ.2,400 కోట్ల డీల్

HAL BEL deal: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌​, భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తేజస్ ఎంకే1ఏ ప్రోగ్రామ్ కోసం 20 రకాల వ్యవస్థల అభివృద్ధి, సరఫరా కోసం ఉద్దేశించిన రూ.2,400 కోట్ల ఒప్పందంపై అధికారులు సంతకం చేశారు. మరోవైపు, దిగుమతి నిషేధం విధించిన రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇవ్వనుంది కేంద్రం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • 'యుద్ధ విమానాల పవర్'​లో భారత్ ర్యాంక్​ @ 4

Indian military aircraft fleet: దేశంలో 700 యుద్ధ విమానాలు, 253 రవాణా విమానాలు, 805 యుద్ధ హెలికాప్టర్లు యాక్టివ్​గా ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్​ మిలిటరీ ఎయిర్​క్రాప్ట్​ ఫ్లీట్​ ఉన్న దేశంగా భారత్​ నిలిచింది. తొలి స్థానంలో అమెరికా కొనసాగుతోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఇకపై ఆయాలు, పని మనుషులకూ వేతన సెలవులు!

Sick leaves for domestic workers: ఇళ్లలో పనిచేసే ఆయాలు, క్లీనర్లు, గార్డెనర్లకు వేతనంతో కూడిన సిక్ లీవులు అందనున్నాయి. ఇందుకోసం అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్సో ఓ చట్టం తీసుకొస్తోంది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • బ్యాంకులు బంద్- ఆ లావాదేవీలపై ప్రభావం

Bank Strike News: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజుల పాటు సాగే ఈ బంద్ బ్యాంక్​ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • కోహ్లీ x గంగూలీ.. ఇంత వివాదం ఎందుకు?

Kohli Ganguly Controversy: విరాట్‌ కోహ్లీ.. భారత జట్టులో ఇప్పటివరకు ఎదురులేని సారథి. తన ఆటతో, వ్యూహ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మేటి క్రికెటర్‌. ఫార్మాట్లకు అతీతంగా వరుసగా సిరీస్‌లు గెలుస్తూ టీమ్‌ ఇండియాను బలమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఫలితంగా తనకెవరూ సాటిరాని విధంగా ఎదిగిపోయాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

  • Pushpa Movie: ఆ రాష్ట్రంలో 'పుష్ప' సినిమాకు సెగ!

Boycott Pushpa: అల్లుఅర్జున్​ 'పుష్ప' సినిమాకు కర్ణాటకలో సోషల్​మీడియా సెగ తగిలింది. 'బాయ్​కాట్​ పుష్ప' అంటూ ట్రెండింగ్​ చేస్తున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Dec 16, 2021, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details