ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - trending news

.

TOP NEWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Jul 13, 2020, 9:00 PM IST

  • ప్రవేశ పరీక్షలు వాయిదా
    ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెస్టుల ఆన్‌లైన్‌ షెడ్యూల్‌ ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించినట్లు సురేశ్ తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • నాపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకం
    వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకం పోయిందని చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'సీఎం నిర్ణయాలను ప్రశ్నించే స్థాయిలో నేను లేను'
    రాష్ట్ర ప్రభుత్వం తనను బదిలీ చేయటంపై ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయిలో తాను లేనని అన్నారు. సీఎం ఆదేశాలను అమలు చేయడమే తన విధి అని చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఆదాయం గణనీయంగా తగ్గింది
    కరోనా ప్రభావంతో మూడు నెలల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేయడం.. తిరిగి ప్రారంభించినా పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనాలకు అనుమతించలేని పరిస్థితుల్లో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని.. అయినా తితిదేకు నిధుల కొరత లేదని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • కరోనా కేర్​ సెంటర్​!
    దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... ఆసుపత్రుల్లో పడకలు దొరకక ఎందరో బాధితులు ఇక్కట్లు పడుతున్నారు. ఆ ఇబ్బంది కర్ణాటక ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో.. ఏకంగా 10,100 పడకలతో కరోనా కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • కరోనాతో విలవిల
    దేశంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6,497 కేసులు నమోదయ్యాయి. తాజాగా 193 మంది వైరస్​కు బలయ్యారు. తమిళనాడులోనూ కరోనా తీవ్రత పెరిగింది. తాజాగా 4,328 కేసులు వెలుగుచూశాయి. 66 మంది మరణించారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఎల్​జీ స్థాయి చర్చలు
    భారత్- చైనా సైన్యం మధ్య నాలుగో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మంగళవారం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్​లో సైనిక ఉద్రిక్తతను తగ్గించి, ప్రతిష్టంభనను తొలగించడంలో భాగంగా ఈ సమావేశంలో తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం
    జూన్​ నెలలో రిటైల్​ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో 6.09 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం గణాంకాలు విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతంగా నమోదైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • దాదా చొక్కా విప్పితే.. భారత్​ మీసం తిప్పింది
    భారత క్రికెట్ అభిమానులకు గొప్ప కిక్కిచ్చిన మ్యాచ్​ల్లో నాట్​వెస్ట్ సిరీస్ ఫైనల్ ఒకటి. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చెప్పవచ్చు. లార్డ్స్ మైదానంలో గంగూలీసేన ఈ సిరీస్ గెలిచి నేటికి సరిగ్గా 18 ఏళ్లు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • బీచ్​లో 'భౌతిక దూరం
    బాలీవుడ్​ బ్యూటీ సన్నీలియోని కుటుంబంతో కలిసి సముద్ర తీరాల వద్ద సరదాగా గడుపుతోంది. అయితే, కరోనా సోకకుండా ఉండేందుకు బీచ్​లోనూ భౌతిక దూరం పాటిస్తున్నట్లు చెప్పిందీ అమ్మడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details