- రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల బస్సు యాత్ర.. అక్కడినుంచే ప్రారంభం !
Ministers Bus Tour: ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లోని మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
- 'జగన్‌కు పాలన చేతకాకుంటే.. రాజీనామా చేయాలి'
పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం జగన్ నోరువిప్పాలని డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్న ఉమా.. పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తారు.
- బీసీలకు సమన్యాయం అంటే.. పక్క రాష్ట్రం వాళ్లకు పదవులు ఇవ్వడమా?: శ్రావణ్ కుమార్
వైకాపా రాజ్యసభ సభ్యుల ఎంపిక రాజకీయ అజెండాతోనే జరిగిందని జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క బీసీ నాయకుడికి కూడా రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
- రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేత!
రాష్ట్రంలోని పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై విధించిన పరిమితులను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
- నిఖత్ జరీన్ జోరు.. ఫైనల్‌కు అర్హత
Nikhat Zareen World Boxing Championship final: జూనియర్ స్థాయిలో సంచలనాలు నమోదు చేసిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ అదరగొడుతోంది. ఇప్పుడు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
- దిల్లీ రాజకీయాల్లో ట్విస్ట్.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా
దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు.. తన రాజీనామాను పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
- సీఎంతో మీటింగ్‌కు వచ్చి ప్లేట్ల కోసం ఫైట్- చిక్కుల్లో ప్రధానోపాధ్యాయులు
విద్యా ప్రమాణాలు పెంచడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నిర్వహించిన ఓ సమావేశం.. రెండు జిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చిక్కులు తెచ్చిపెట్టింది. సీఎంతో భేటీ తర్వాత భోజనం ప్లేట్ల కోసం వారంతా గొడవ పడడమే ఇందుకు కారణం.
- తగ్గిన బంగారం ధర.. వెండి పైపైకి.. స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.290 మేర దిగొచ్చింది. మరోవైపు వెండి ధర భారీగా వృద్ధి చెందింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1100పెరిగి రూ.62,740 వద్ద కొనసాగుతోంది.
- 'పెట్రోల్‌కు డబ్బుల్లేవ్.. బయటకు వెళ్లకండి'.. చేతులెత్తేసిన లంక ప్రభుత్వం!
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న మన పొరుగు దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ దొరక్క అల్లాడుతున్న జనం వంట చేసుకునేందుకు కిరోసిన్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది.
- ఆది పెళ్లిలో నాని హంగామా.. సాంగ్‌తో 'మేజర్', 'గాడ్సే' రిలీజ్ డేట్
నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగుతోంది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఈరోజు(బుధవారం) సాయంత్రం మూడుముళ్లు వేయనున్నారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.