ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - breaking news

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధానవార్తలు
TOP NEWS

By

Published : Jul 6, 2021, 7:00 PM IST

  • విశాఖ: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి

నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,378 పరీక్షలు నిర్వహించగా.. 3,042 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,08,065 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 28 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,898కి చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు జగ్జీవన్ రామ్'

బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Himanshu: కేసీఆర్ మనుమడు హిమాన్షు.. సంచలన ట్వీట్!

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. తాను భవిష్యత్​లో ఏం చేయదలుచునేది, సాధించాలనుకునేది ఆ ట్వీట్​లో హిమాన్షు తేల్చి చెప్పేశాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ లాక్​డౌన్​ తప్పదా? కేంద్రం ఆంతర్యమేంటి?

హిల్ స్టేషన్లకు పర్యటకులు పోటెత్తటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్​లోని సిమ్లా, మనాలీలో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించట్లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎస్​బీఐలో 6,100 ఉద్యోగాలు- అప్లై చేయండిలా..

ఎస్​బీఐ ఉద్యోగాల(bank jobs india) నోటిఫికేషన్ విడుదలైంది. అప్రెంటిస్​ ప్రాతిపదికన 6,100 పోస్టులను భర్తీ చేయనుంది. మరి వీటికి ఎలా అప్లై చేయాలి? ఎంపికైతే స్టైపెండ్ ఎంత? అనే వివరాలు తెలుసుకోండి..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మర్మాంగాన్ని కొరికిన కొండచిలువ- బాత్​రూంలో ఉండగా..

ఓ వ్యక్తి బాత్​రూంకు వెళ్లి టాయిలెట్​ సీట్​​పై కూర్చోగానే.. 5 అడుగుల కొండచిలువ అతని మర్మాంగాన్ని కరిచింది. ఆస్ట్రేలియాలో జరిగింది ఈ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.లక్ష కోట్ల దిగువకు జీఎస్​టీ వసూళ్లు

గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ దాటుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్​లో నెలలో రూ.92 వేల కోట్లకు పరిమితమయ్యాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల వసూళ్లు తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ 2020 జూన్​తో పోలిస్తే.. ఈ మొత్తం 2 శాతం ఎక్కువి పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Teamindia: ద్రవిడ్​ అసహనం.. కోహ్లీసేన అసంతృప్తి!

పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(Devadutt Padikkal, Prithvi shah) ఇంగ్లాండ్​ పర్యటనకు పంపించే విషయమై​ జట్టు యాజమాన్యం, బీసీసీఐ(BCCI), సెలక్షన్‌ కమిటీ మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో కోహ్లీసేన, రాహుల్​ ద్రవిడ్(RahulDravid)​ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రణ్‌వీర్‌-అలియా సినిమాలో​ లెజండరీ యాక్టర్లు

బాలీవుడ్ నిర్మాత కరణ్​ జోహార్(Karan Johar).. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్​వీర్ సింగ్​(Ranveer Singh), అలియా భట్​(Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్​ లెజండరీ నటీనటులు ధర్మేంద్ర, జయా బచ్చన్​, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details