ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - trending news

.

TOP NEWS @ 7 PM
ప్రధాన వార్తలు@9PM

By

Published : Jun 22, 2020, 7:02 PM IST

  • గవర్నర్​తో సీఎం జగన్ భేటీ..
    గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను సీఎం జగన్ కలిశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాలపాటు గవర్నర్​తో సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
  • 'మతలబు ఏంటి'
    ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్​ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబర్‌ 12 వరకు కాలపరిమితి ఉన్నా..2019 సెప్టెంబర్‌ 20న కొత్త ఏజెన్సీ కోసం జీవో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
  • అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా
    మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పిటిషన్‌పై విచారణను అనిశా కోర్టు రేపటికి వాయిదా వేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్టు చేసింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి
  • బాలకృష్ణ నెరవేరుస్తున్నారు
    పేదల సేవలో 20 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • సరిహద్దు ఉద్రిక్తం
    భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాలు భారీ స్థాయిలో ఆయుధ సామగ్రి, యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు చేరవేస్తున్నాయి. చైనా దాడులకు తెగబడితే ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధమవుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పూరీ రథయాత్రకు సుప్రీం అనుమతి.. కానీ!
    కరోనా వ్యాప్తి కారణంగా పెద్దసంఖ్యలో గుమిగూడటంపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై కీలక తీర్పును ప్రకటించింది సుప్రీంకోర్టు. జూన్​ 23న ప్రారంభం కానున్న ఈ యాత్రను భక్తులు లేకుండా జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఆ సైకిల్​పై 4 తరాల నాన్​స్టాప్​ సవారీ
    లక్షలు పోసి కొనే ఎన్నో కార్లు నాలుగైదేళ్లకే మూలనపడుతున్నాయి. పది పదిహేనేళ్లు దాటితే.. పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, 70 ఏళ్ల క్రితం నాటి ఓ సైకిల్​ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'కృష్ణ మొదటి లీల'
    రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమాలో సిద్ధు, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'వ్యాయామాలతో రోగ నిరోధక శక్తి
    వ్యాయామాలతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని చెబుతోంది భారత షట్లర్​ పీవీ సింధు. ప్రస్తుతం కరోనాకు మందు లేని కారణంగా మనలోని ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవడమే ఉత్తమమని తెలిపింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details