ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ap top ten news

.

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 28, 2021, 4:59 PM IST

  • ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి: పేర్ని నాని
    "రెండు తెలుగు రాష్ట్రాలనూ కలిపేద్దాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు మంత్రి పేర్నినాని సూచించారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా ఏపీలో పోటీ చేయొచ్చన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP Cabinet decisions : అదానీ సంస్థకు 130 ఎకరాలు.. సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ..
    సీఎం జగన్ అధ్యక్షత జరగిన మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు, విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అభ్యంతరకర పోస్టులను తొలగించేందుకు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు : హైకోర్టు
    సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులను తొలగించేందుకు.. చర్యలు ఎందుకు తీసుకోలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెరిగిన పెట్రో, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు
    పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరగొడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొనలేమని..పెంచిన ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్షాలతో కలిసి నిరసనలు చేపట్టాయి పలు సంఘాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చనిపోయిన వారికి వివాహం.. ఇదో వింత ఆచారం!
    కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమవారికి వివాహం జరుపుతున్నారు. అది కూడా సాధారణంగా పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోని రీతిలో! అసలు చనిపోయిన వారికి ఎలా వివాహం జరిపిస్తారు? అసలు ఎందుకు ఇదంతా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండు బైక్​లు ఢీ.. ఐదుగురు మృతి.. మరొకరు..
    రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌- ప్రపంచ నేతలకు వార్నింగ్
    ఎన్నో ఏళ్ల కింద అంతరించిపోయిన డైనోసర్​ మళ్లీ ప్రత్యక్షమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (Dinosaur at united nations) జరుగుతుండగా.. ఓ డైనోసర్​ వచ్చింది. అది చూసి ప్రపంచ నేతలు, పలు దేశాల ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1159 పాయింట్లు పతనం
    స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1159 పాయింట్లు కోల్పోయి.. 60 వేల దిగువన స్థిరపడింది. నిఫ్టీ 18 మార్క్​ను కోల్పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 world cup: 'భారత్​-న్యూజిలాండ్​ మ్యాచ్​ను అలా చూడొద్దు'
    టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం(అక్టోబర్ 31) మ్యాచ్(IND vs NZ T20 Match)​ జరగనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR movie: 'ఆర్​ఆర్​ఆర్​' నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనా?
    అక్టోబర్​ 29న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రబృందం(Rajamouli RRR movie) ​. ఇప్పుడా బిగ్​ అప్డేట్​ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details