ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news at 3pm
ప్రధాన వార్తలు @ 3PM

By

Published : Jan 15, 2021, 2:59 PM IST

  • కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...
    కడప జిల్లాలోని రైతుల ఇంట సంక్రాంతి పండగ శోభ కనిపించడం లేదు. వీరికి 2020 ఏ మాత్రం కలిసి రాలేదు. మార్చి నుంచి కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అటకెక్కిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం..
    కూలీల కొరతతో అన్నదాతలు ఆధునిక యంత్రాలవైపు మెగ్గు చూపుతున్నారు. ఏటికేడు యంత్రాలతో సాగు పెరుగుతూ వస్తోంది. అయితే యంత్రాల ధరలు అధికంగా ఉండటం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ లేక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • హాయ్​ అంటూ హస్కీగా పలకరిస్తారు..
    మీరు వాట్సప్ ,ఫేస్ బుక్ వినియోగిస్తున్నారా ? జర జాగ్రత్త .. అపరిచితులతో ఛాటింగ్ ..అనవసరమైన లింకులను క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మత్తుగా మాట్లాడుతూ .. అందం ఎరవేసి ఆకర్షిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మంత్రి శ్రీపాదనాయక్​కు వెంకయ్య పరామర్శ
    కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఆయన చికిత్స పొందుతున్న గోవా వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లిన వెంకయ్య.. నాయక్​ ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. ఆయన​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • తలుపులు తెరవలేదని ఇల్లు తగలబెట్టిన తాగుబోతు
    మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తలుపులు తెరవలేదనే కోపంతో.. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే నిప్పంటించాడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రామాలయానికి తొలి విరాళం అందించిన రాష్ట్రపతి
    అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి తొలి విరాళం అందించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. చెక్కు రూపంలో రూ.5 లక్షలు ఇచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​, విశ్వహిందూ పరిషత్​ నేతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పక్క రాష్ట్రాలకు కరోనా రోగులు తరలింపు- కారణమిదే...
    భూమండలానికే ఆక్సిజన్​ అందించే అమెజాన్​ అటవీ ప్రాంతం కలిగిన బ్రెజిల్​లోని మనౌస్​ నగరంలో కొవిడ్​ రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఆక్సిజన్​ అందక మృత్యు ఒడికి దగ్గరవుతున్నారు. డజన్ల కొద్దీ రోగులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రుణ యాప్​లపై కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు
    ఆన్​లైన్ రుణ సంస్థల నియంత్రణ కోసం దాఖలైన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రానికి, ఆర్​బీఐకి తాఖీదులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • బ్రిస్బేన్ టెస్టు: తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5
    బ్రిస్బేన్​ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్​ జట్టు 274 పరుగులు చేసింది. మరోవైపు భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్​, సుందర్​, శార్దూల్​ తలా ఓ వికెట్​ పడగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'సలార్​' షురూ.. ముఖ్య అతిథిగా రాకీభాయ్​
    యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ కొత్త చిత్రం 'సలార్'​.. పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్​లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కన్నడ సూపర్​స్టార్​ యశ్​ విచ్చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details