ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - trending news

.

top news 9am
ప్రధాన వార్తలు @ 9AM

By

Published : Jul 4, 2020, 9:15 AM IST

  • అ(స)మరావతి

వారి శ్వాస అమరావతి... వారి ధ్యాస అమరావతి. ఆంక్షలు, నిర్బంధాలు, అరెస్టులు వారిని ఆపలేకపోయాయి. కేసులు వెంటాడుతున్నా వెనకడగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు అదే పోరాటం... అమరావతే ఏకైక నినాదం. ప్రతి పల్లెలో పార్టీలకతీతంగా ఐకాసలు ఏర్పాటు చేసి పోరాటాన్ని నడుపుతున్నారు. కరోనా భయం, లాక్​డౌన్​ ఆంక్షలు గౌరవిస్తూనే భౌతికదూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పోరాట స్ఫూర్తి

'అ 'అంటే అమ్మ...'ఆ' అంటే ఆవు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం ఎవర్ని కదిపినా 'అ' అంటే.. అమరావతి..............'ఆ' అంటే ఆశయం అనే మాటే. ఆర్నెళ్లుగా అక్కడ అదే సిలబస్‌. ఖాకీలు దండెత్తినా, పాలకులు అవమానించినా, అవహేళన చేసినా వెన్ను చూపలేదు. నిర్బంధిస్తే నిగ్గదీశారు. లాఠీ ఎత్తితే మరింత గట్టిగా గొంతెత్తారు. కేసులు పెడితే న్యాయపరంగా కొట్లాడారు. అమరావతి పోరాట పటిమపై ప్రత్యేక కథనం.

  • జాతీయ విషాదమే

అమరావతి నిర్మాణం నిలిపివేయడం ఒక జాతీయ విషాదం అని తెదేపా అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది తుగ్లక్‌ నిర్ణయమన్న ఆయన.. అద్భుత రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దూరం చేసిందని మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆదా నీటిని వాడుకుంటాం

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు మళ్లింపు వల్ల ఆదా అయ్యే నీటిని.... వివిధ ప్రాజెక్టులకు వినియోగించుకుంటామని కృష్ణాబోర్డుకు రాష్ట్రం లేఖ రాసింది. ఇటీవల జరిగిన భేటీలోని మినిట్స్‌పై అభ్యంతరాలు తెలిపింది. గత కొన్నేళ్లుగా ఈ నీటిని కేటాయించాలంటూ తెలంగాణ కోరుతుండగా.... ఇప్పుడు ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • మోదీ వస్తే ప్రారంభం

అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి జులై 18న రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు భేటీ కానున్నారు. ఆలయ స్తంభాలకు పునాది రాళ్లు వేసే విషయమై ఇందులో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ఒకసారి పర్యటిస్తే నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ దాస్ చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఎలా సాధ్యం..?

కరోనా మహమ్మారి నివారణకు ఆగస్టు 15 నాటికి టీకా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐసీఎంఆర్‌- భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాగ్జిన్‌), మనుషులపై ప్రయోగాల స్థాయికి (మొదటి, రెండో దశ) చేరింది. ఈ పరీక్షలను సత్వరం పూర్తిచేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కొత్తరకం కరోనా

కొవిడ్​కు సంబంధించి మరో భయానక విషయాన్ని కనుగొన్నారు పరిశోధకులు. రోజురోజుకీ కరోనా వైరస్‌ జన్యుక్రమంలో వస్తున్న పరివర్తనంతో మనుషులకు సోకే సామర్థ్యం మరింత మెరుగుపడుతోందని గుర్తించారు పరిశోధకులు. ఇందుకు సంబంధించిన అధ్యయనం 'జర్నల్​ సెల్' లో ప్రచురితమైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

  • హైవేపై విమానం

సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఓ చిన్న విమానాన్ని నడి రోడ్డుపైనే ల్యాండ్‌ చేసిన ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది. విమానం 2వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్‌.. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అడ్డదారి తొక్కుతారేమో..!

కరోనా నేపథ్యంలో టోర్నీలన్నీ నిలిచిపోయాయి. ఆటగాళ్లకు జీతాల్లో కోతలూ తప్పట్లేదు. అయితే జీతాలు, అలవెన్సుల్లో కోత పెడితే క్రీడల్లో అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • టార్గెట్​ సంక్రాంతి

సంక్రాంతి.. బడా చోటా హీరోల సినిమాలు పోటాపోటీగా వరుసగా విడుదలై వసూళ్లు కురిపిస్తుంటాయి. కానీ ఈసారి కరోనా వల్ల రాబోయే పండగా ప్రణాళికంతా తారుమారైపోయింది. ఒకవేళ పండగ సమయానికి థియేటర్లు తెరిస్తే ఏ హీరో చిత్రం విడుదలవొచ్చు. పరిశ్రమలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలు తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details