- తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి.. లోకేష్ హాజరు
దుండగుల దాడిలో హతమైన తెదేపా నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు ప్రొద్దుటూరులో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అగ్ర నేతల సమక్షంలో.. సుబ్బయ్య అంతిమయాత్ర జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సుబ్బయ్య కుటుంబానికి తెదేపా సాయం రూ. 20 లక్షలు
తెదేపా నేత నందం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న నారా లోకేష్... బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 20 లక్షలు ప్రకటించారు. నిందితులపై 15 రోజుల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. గాయని సునీత తన వివాహం జనవరి 9న జరగనుందని.. అందుకే స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా తదితరులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్రైమ్ రౌండప్: 'గతేడాది కంటే నేరాలు తగ్గాయి'
2020లో పోలీసు శాఖ పనితీరు, నేర గణాంకాల వార్షిక నివేదికను వివిధ జిల్లాల్లో పోలీసు అధికారులు విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపు చేశామని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజలకు త్వరలోనే స్వదేశీ టీకా: మోదీ
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, వచ్చే ఏడాది(2021)లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్ షో