రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో విడత మెుత్తం 3,221 పంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమవ్వగా.. 2,639 సర్పంచి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2,639 పంచాయతీలకు 7,757 మంది సర్పంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మూడో విడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమవ్వగా..19,553 వార్డు స్థానాలకు పోటీ ఉంది. వార్డు స్థానాలకు 43,162 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.