'స్పందన'పై నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దరఖాస్తుల సత్వర పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తారు. ఉదయం 11.30 గం.కు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్న ముఖ్యమంత్రి.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆక్సిజన్, బెడ్ల కొరత పరిష్కారంతో పాటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమావేశంలో మాట్లాడనున్నారు.
'స్పందన'పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - ap latest news
ముఖ్యమంత్రి జగన్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అభివృద్ధి పథకాలు, కరోనా నివారణ చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
cm jagan to conduct review meeting on spandana