ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల నిర్వహణపై నిఘా వ్యవస్థ: ఎస్ఈసీ - ఎన్నికల నిర్వహణపై నిఘా యాప్

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీకి ఉన్న అభిప్రాయాన్ని అత్యంత సుస్పష్టంగా చెప్పినా....కొందరు పెడార్ధాలు తీస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడం శ్రేయస్కారం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు నిఘా యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు.

ap sec nimmagadda ramesh
ap sec nimmagadda ramesh

By

Published : Feb 3, 2021, 3:46 AM IST

పల్లె పోరులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై కలెక్టర్లు, అధికారులతో..ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు పక్కాగా చేశారని ప్రశంసించారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం జరుగుతుందన్న ఆయన....అది అవాస్తవమని తేల్చిచెప్పారు. పోటీ ఎక్కువగా ఉండి, ప్రజలందరూ ఎన్నికల్లో భాగస్వామ్యులు అవ్వాలని, అందుకు ఏకగ్రీవాలు అడ్డుకాకూడదనే చెప్పానని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి సంశయం లేదన్నారు.

నేడు నిఘా యాప్ ఆవిష్కరణ..

ఎన్నికల తీరును పరిశీలించేందుకు రూపొందించిన ప్రత్యేక నిఘా యాప్‌ను.. ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవిష్కరించనున్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇతరాత్రా సమస్యలు నేరుగా ఎస్ఈసీకి తెలియజేసే అవకాశం అందుబాటులోకి రానుంది.

ప్రత్యేక పరిశీలకుడిగా మాజీ ఎస్ఈసీ

ఇదే సమయంలో ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకుడిగా పాల్గొనాలని.. తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని ఎస్ఈసీని అహ్వానించింది. మాజీ ఎస్ఈసీతో పాటు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం, సేవలను పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఉపయోగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో పర్యటన...

ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ ఇవాళ, రేపు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల అధికారులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

ఇదీ చదవండి

తెదేపా నేత పట్టాభిపై దాడి.. అసలేం జరిగింది..?

ABOUT THE AUTHOR

...view details