ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

థమ్స్ అప్‌ లోడ్ లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడిన జనం! - ఓఆర్‌ఆర్‌పై థమ్స్ అప్‌ లోడ్ లారీ బోల్తా

Thums up load Lorry Bolta : థమ్స్అప్ లోడ్‌తో వెళ్తోన్న లారీ టైర్ పేలి అదుపుతప్పి హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుపై పడిపోయింది. లారీలోని కూల్‌డ్రింక్ సీసాలన్నీ రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడగా.. వారిని పట్టించుకోకుండా వాహనదారులు అందిన కాడికి థమ్స్అప్ సీసాలు ఎత్తుకెళ్లారు.

Thums up load Lorry
థమ్స్ అప్‌ లోడ్ లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడిన జనం

By

Published : Apr 20, 2022, 2:27 PM IST

Thums up load Lorry Bolta : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘట్‌కేసర్‌ మార్గంలో థమ్స్‌అప్‌ లోడ్‌తో వెళుతున్న లారీ టైర్‌ పేలడంతో అదుపుతప్పి రింగ్‌ రోడ్డులోని విభాగినిపై పడిపోయింది. దీంతో లారీలోని థమ్స్‌అప్‌ శీతల పానీయం సీసాలు రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని పట్టించుకోకుండా వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి అందిన కాడికి ఆ సీసాలను తీసుకెళ్లారు. కొంతసేపట్లోనే లారీలోని మొత్తం సరకు ఖాళీ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

థమ్స్ అప్‌ లోడ్ లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడిన జనం

ABOUT THE AUTHOR

...view details