Three died with Electric shock: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఆలయంలో మైక్‌సెట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి వర్షం కురవడంతో తీగల్లో విద్యుత్ ప్రవహించి అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో మృతులు ముగ్గురు.. ఒకరికొకరు అంటుకుని ఉండటంతో విద్యుత్ షాక్‌కి గురై ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలిపారు. మృతులు సుబ్బారావు(67), మస్తాన్‌రావు(57), వెంకయ్య (55)లుగా గుర్తించారు.
గుడిలో మైక్‌సెట్ చేస్తుండగా విద్యుదాఘాతం.. ముగ్గురు మృతి - గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతం
Three died: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా అందనాలపాడులో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. గ్రామంలోని ఆలయంలో మైక్‌సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది.
three died due to electric shock at mahabubabad
గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. దైవకార్యం కోసం వస్తే తమ ఇంటి పెద్దదిక్కులు దేవుడి దగ్గరికే వెళ్లిపోయారంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- ఇదీ చదవండి :వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి!
ACCIDENT IN GHAT ROAD: గువ్వల చెరువు ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి
Last Updated : Jun 21, 2022, 3:14 PM IST