ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ - AP panchayat elections news

నేటి నుంచి మూడో దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మూడు రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 8 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లలోని 164 మండలాల్లో మూడో దఫా ఎన్నికలు జరగనున్నాయి.

Third phase of panchayat elections .. Full information
Third phase of panchayat elections .. Full information

By

Published : Feb 5, 2021, 5:36 PM IST

Updated : Feb 6, 2021, 3:07 AM IST

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 9 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్​లోని ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పాలకొండ రెవెన్యూ డివిజన్​లో భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి ఆమదాలవలస మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.

విజయనగరం జిల్లాలో...

విజయనగరం రెవెన్యూ డివిజన్​ పరిధిలోని 9 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం రెవెన్యూ డివిజన్​లోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, మొరకముడిదం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, విజయనగరం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

విశాఖ జిల్లాలో...

పాడేరు రెవెన్యూ డివిజన్​లోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పాడేరు రెవెన్యూ డివిజన్​లో అనంతగిరి, అరకువ్యాలీ, చింతపల్లి, దుంబ్రిగూడ, జి.మాడుగుల, జి.కె.వీధి, హుకూంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్​లోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్​లో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వైరామవరం మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏటపాక రెవెన్యూ డివిజన్​లో చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఏటపాక మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

జంగారెడ్డిగూడెం, ఏలూరు, కుక్కునూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. జంగారెడ్డిగూడెం డివిజన్​లో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏలూరు రెవెన్యూ డివిజన్​లో చింతలపూడి, కామవరపు కోట, లింగపాలెం, టి.నర్సాపురం మండలాల్లో ఎన్నికలు ఉండనున్నాయి. కుక్కునూరు రెవెన్యూ డివిజన్​లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

కృష్ణా జిల్లాలో...

మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాల్లో మూడో దఫా ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్​లోని అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లాలో..

గురజాల రెవెన్యూ డివిజన్​లోని 9 మండలాల్లో మూడోదఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దాచేపల్లి, దుర్గి, గురజాల, కారెంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్ల ఎన్నికలు జరుగుతాయి.

ప్రకాశం జిల్లాలో...

కందుకూరు రెవెన్యూ డివిజన్​లోని 19 మండలాల్లో మూడోదఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్​ పరిధిలోని కొండెపి, జరుగుమల్లి, ఎస్.కొండ, మర్రిపూడి, సీఎస్ పురం, గుడ్లూరు, హెచ్.ఎం.పాడు, కందుకూరు, కనిగిరి, కె.కె.మిట్ట, లింగసముద్రం, పామూరు, సిసిపల్లి, పొదిలి, పొన్నలూరు, తర్లుపాడు, ఉలవపాడు, వెలిగండ్ల, వి.వి.పాలెం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

నెల్లూరు జిల్లాలో...

గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో 15 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్​లోని బాలాయిపల్లి, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, గూడూరు, కోట, సైదాపురం, వాకాడు, వెంకటగిరి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాయుడుపేట రెవెన్యూ డివిజన్​లో డి.వి.సత్రం, నాయుడుపేట, ఓజిలి, పెల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

కర్నూలు జిల్లాలో...

ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్లలోని 14 మండలాల్లో మూడో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఆదోని రెవెన్యూ డివిజన్​లో మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచర్ల, డోన్, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.

అనంతపురం జిల్లాలో...

అనంతపురం రెవెన్యూ డివిజన్​లో 19 మండలాల్లో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతపురం రెవెన్యూ డివిజన్​లో... అనంతపురం, ఆత్మకూరు, బి.కె.సముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్, కూడేరు, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపొనకల్, యాడికి, ఎల్లనూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

కడప జిల్లాలో...

రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాజంపేట రెవెన్యూ డివిజన్​లోని కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పెనగలూరు, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కడప రెవెన్యూ డివిజన్​లో టి.సుండుపల్లి, నీరబల్లి మండలాల్లో ఎన్నికలున్నాయి.

చిత్తూరు జిల్లాలో...

మదనపల్లి రెవెన్యూ డివిజన్​లోని 14 మండలాల్లో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్​లో గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచర్ల, సోదాం, సోముల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, వి.కోట మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈనెల 9న మూడో దఫాలో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 12న మధ్యాహ్నం 3 గంటల వరకు మూడోదఫా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈనెల 17న మూడో దఫా పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

ఇదీ చదవండీ... కొప్పర్రులో 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' ఉద్యమం..!

Last Updated : Feb 6, 2021, 3:07 AM IST

ABOUT THE AUTHOR

...view details