Accident in cc footage: తెలంగాణలోని మేడ్చల్ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన నవ దంపతులు సాయిరాజ్, సారిక సొంత ఊరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా మేడ్చల్ బస్ డిపో ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా ఢీ కొట్టారు. వేగానికి పాదచారి దూరంగా ఎగిరిపడి చనిపోగా.. రోడ్డుపై పడిపోయిన దంపతుల పైనుంచి వెనుక నుంచి ఇనుము లోడుతో వస్తున్న లారీ వెళ్లడంతో వారు అక్కడికిక్కడే మృతి చెందారు. మృతులు సాయిరాజ్, సారికకు ఈ ఎడాది మార్చిలో పెళ్లి అయ్యింది. వీరు వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటుండగా.. ఆదివారం సెలవు దినం కావటం సొంత ఊరిలో వినాయక నిమజ్జానికి వెళ్లి.. తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవదంపతుల అకాల మరణంతో సొంత గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Accident in CC Footage: ముగ్గురు ప్రాణాలు తీసిన వేగం.. సీసీ కెమెరాలో దృశ్యాలు - A lorry that collided with a bike
Accident in cc footage: తొందరగా ఇంటికి వెళ్లాలనే వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తెలంగాణలోని మేడ్చల్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. నవదంపతులతో పాటు, ఓ పాదచారి దుర్మరణం పాలైయ్యారు.
accident