రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై ముందడుగు - parlamentary constituencies
పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి ఛైర్మన్‌గా... విద్యాశాఖ మంత్రి కో- ఛైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా... అలాగే కమిటీ నియమించే నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.