పచ్చని సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చుపెట్టింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండిబగూడకు చెందిన రమాకాంత్‌కు నాలుగేళ్ల కిందట జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్ వాసి సోన్‌కాంబ్లె సీతాల్తో వివాహం జరిగింది. కూలీనాలీ చేస్తూ అన్యోన్యంగా కొనసాగుతున్న దంపతుల జీవితంలోకి అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్ ఫోన్‌కాల్‌తో చిచ్చురేగింది.
పచ్చని సంసారంలో చిచ్చు - ప్రాణం తీసిన ఫోన్ కాల్ - A phone call spilled over to the green
ఆకతాయి ఫోన్ చేసి విసిగించడం.. దానిని భర్త అనుమానించడం.. ఇదంతా అవమానంగా భావించిన ఓవివాహిత ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో జరిగింది.
తరచుగా సదరు వివాహితకు అనికేతన్ ఫోన్ చేసి వేధిస్తుండడం వల్ల విసుగుచెందిన ఆమె అతణ్ని ఫోన్‌లోనే నిలదీసింది. కోపోద్రిక్తుడైన యువకుడు వివాహితపై ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలో ఈ నెల ఏడున రమాకాంత్ భార్యను నిలదీశాడు. ఇద్దరూ గొడవపడ్డారు.
పురుగుల మందు తాగి...
తనపై అకారణంగా నిందలు వేయడమే కాక ఫోన్ ద్వారా యువకుడు వేధింపులు ఆపకపోవడం వల్ల సీతాల్ పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సీతాల్ కన్నుమూసినట్లు ఎస్‌ఐ తిరుపతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
TAGGED:
phone call