Joint staff council meeting held on tomorrow: ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కానుంది. పీఆర్సీ సంబంధిత అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భేటీకి హాజరుకావాలని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఈ మేరకు ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి నుంచి సమాచారం అందింది.
ప్రభుత్వ ఆహ్వానంతో ఉద్యోగులు చర్చలకు సిద్ధమవుతున్నారు. రేపటి భేటీలో ప్రధానంగా పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ నోటీసులిచ్చాయి. డిసెంబర్ 7 నుంచి నిరసనలకు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారితో మరో దఫా చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.