జూనియర్ సివిల్ జడ్జి నియామకాలపై నిషద్ అనే మహిళ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపింది. నియామకాల్లో రాత పరీక్ష ,ఇంటర్వ్యూలో బీసీలకు ఓసీలతో పాటు 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనలు చట్టవిరుద్దమని పిటిషనర్ తరుపు న్యాయవాది యాలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి.. ఉద్యోగం రాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓసీలతో పాటు బీసీలకు పరీక్షల్లో 55 శాతం.. ఇంటర్వ్యూలో 60 శాతం పెట్టడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్ 14 ప్రకారం ఈ నిబంధన చట్ట విరుద్ధమని న్యాయవాది అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ జ్యూడిషియల్ సర్వీస్‌లో నిబంధనలు 6f లో ఉన్న 60 శాతం మార్కులు రిటర్న్,ఇంటర్వ్యూలో బీసీలకు ఓసీలతో పాటు మార్కులు రావాలన్న అంశాన్ని కొట్టివేసింది. పిటిషనర్ నిషద్‌ను జూనియర్ సివిల్ జడ్జిగా నియామకం చేయాలని రిజిస్టార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
junior civil judge case: బీసీలకు 60శాతం మార్కుల నిబంధన వర్తించదు.. - జూనియర్ సివిల్ జడ్జి కేసు తాజా సమాచారం
జూనియర్ సివిల్ జడ్జి నియామకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీలకు ఓసీలతో పాటు 60శాతం మార్కులనే నిబంధనపై ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. నిబంధనను కొట్టివేసింది.
junior civil judge case
Last Updated : Sep 24, 2021, 5:09 AM IST