ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమ్మఒడి లబ్ధిదారులకు... ప్రభుత్వం షాక్ - అమ్మఒడికి ప్రభుత్వం కోత

అమ్మఒడికి ప్రభుత్వం కోత విధించింది. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదని పేర్కొంది.

ప్రభుత్వం
ప్రభుత్వం

By

Published : Apr 15, 2022, 4:56 AM IST

అమ్మఒడి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదని పేర్కొంది. 300 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తోందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడికి సంబంధించిన అర్హతలను పేర్కొన్న విద్యాశాఖ నవంబర్ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం లేకపోయినా ప్రయోజనం పొందలేరని స్పష్టం చేసింది. బియ్యం కార్డు కొత్తది ఉండాలని, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లాల పేరు మార్చుకోవాలని తెలిపింది. బ్యాంక్ ఖాతాల్ని ఆధార్‌తో లింక్‌ చేసుకోవడం సహా ఖాతాలు పనిచేస్తు‌న్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది..

ABOUT THE AUTHOR

...view details