పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 649వ రోజు ఆందోళనలు(Amravati Farmers concern) చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, నెక్కల్లులో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ పెదపరిమి, మందడంలో రైతులు, మహిళలు గ్రామ దేవతకు పొంగళ్లు సమర్పించారు. అమ్మవారికి ఉద్యమ కండువాను కప్పారు. రాజధాని నిర్మాణంపై వైకాపా ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మహిళలు విమర్శించారు. ముఖ్యమంత్రి దిగొచ్చే వరకు ఉద్యమం చేస్తామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. ఉద్యమం 650వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా సోమవారంలో తుళ్లూరులో భారీ మానవహారం నిర్వహించనున్నారు.
Amravati Farmers: 'ముఖ్యమంత్రి దిగొచ్చే వరకు ఉద్యమం చేస్తాం' - Amravati Farmers protest news
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు(Amravati Farmers concern) 649వ రోజుకు చేరుకున్నాయి. రాజధానికి మద్దతుగా తూళ్లూరు, మందడం, పెదపరిమి, నెక్కల్లు, వెలగపూడి, అనంతవరం గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు
Amravati Farmers