ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు - Telangana News Updates

హైదరాబాద్‌లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కును ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన బహుళవిధ మౌలిక సదుపాయాల కేంద్రాలను మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌గా పిలుస్తారు.

హైదరాబాద్​లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు
హైదరాబాద్​లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు

By

Published : Dec 31, 2020, 11:02 PM IST

హైదరాబాద్‌లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు (ఎంఎంఎల్‌పీ)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతోబాటు తమిళనాడులోని కోయంబత్తూరులో కూడా ఎంఎంఎల్‌పీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ రెండు పార్కుల కోసం డీపీఆర్‌ తయారీ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదే తరహాలో దేశంలోని 21 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ స్టడీస్‌ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏటా సగటున 7,975 కిలోమీటర్ల జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) నిర్మాణం పూర్తిచేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ బుధవారం విడుదల చేసిన వార్షిక పురోగతి నివేదికలో వెల్లడించింది.

అన్నీ అక్కడే..

ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన బహుళవిధ మౌలిక సదుపాయాల కేంద్రాలను మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌గా పిలుస్తారు. విమానాలు, నౌకలు, రైల్వేలు, రోడ్డు మార్గం ద్వారా రవాణా అయ్యే వస్తువులను నిర్ణీత ప్రాంతాలకు చేరవేయడానికి అవసరమైన సౌకర్యాలుంటాయి. ప్రధాన కార్యాలయంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన అనుమతులు, ధ్రువీకరణలు ఇచ్చే కార్యాలయాలు, గోదాములు, శీతల గిడ్డంగులు, ఇతర వనరులు ఇందులో ఉంటాయి.

ఇదీ చదవండి:

ప్రతి తీర్పు సంచలనమే.. జస్టిస్ రాకేశ్​కుమార్ 13 నెలల పయనమిదే...

ABOUT THE AUTHOR

...view details