ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

By

Published : May 14, 2020, 7:52 AM IST

dsc 2008
dsc 2008

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం
డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి :
అంగీకరిస్తే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు రావొచ్చు!

ABOUT THE AUTHOR

...view details