ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Water dispute between Telangana and AP : తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పర్వం

రాష్ట్ర సర్కార్.. గాలేరు-నగరి ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ(Water dispute between Telangana and AP) రాశారు. మరోవైపు.. గోదావరి బేసిన్​లో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగేవరకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించవద్దని గోదావరి బోర్డును ఏపీ కోరింది.

Water dispute
Water dispute

By

Published : Oct 1, 2021, 9:07 AM IST

ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణల ఫిర్యాదుల పర్వం(Water dispute between Telangana and AP) కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ గాలేరు-నగరి ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(Water dispute between Telangana and AP) గురువారం లేఖ రాశారు. ప్రస్తుతం ప్రాజెక్టు విస్తరణ చేపట్టడంతో పాటు స్వరూపాన్నే మారుస్తున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. మరోపక్క గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగేవరకు సీతారామ ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించవద్దని ఆంధ్రపద్రేశ్‌ గోదావరి బోర్డు(Water dispute between Telangana and AP)ను కోరింది. ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించవద్దని గోదావరి బోర్డుకు, కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్‌ ఒక రోజు తిరగకముందే సీతారామ ఎత్తిపోతలను ఆమోదించవద్దంటూ మరో ఉత్తరం పంపింది. ఇందులో ఏం పేర్కొన్నదంటే...

వాప్కోస్‌ నివేదిక ప్రకారం గోదావరిలో 13.64 టీఎంసీల లోటు ఉంది. ఎల్లంపల్లి దిగువన, సీతారామ ఎత్తిపోతల వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఉన్న వాటా 991.19 టీఎంసీలు. రాజీవ్‌, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలకు ఉన్న 32 టీఎంసీలతో కలిపి రెండు రాష్ట్రాల వినియోగం 530.83 టీఎంసీలు. పోలవరం వద్ద వినియోగం 474 టీఎంసీలు కాగా, లోటు 13.64 టీఎంసీలు పోనూ 460.36 టీఎంసీలు మాత్రమే ఉంది. 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతలను చేపడితే లోటు 51.64 టీఎంసీలు అవుతుంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన డీపీఆర్‌ల ప్రకారం తీసుకొంటే నీటి వినియోగమే 675.65 టీఎంసీలు. దీని ప్రకారం పోలవరం వద్ద లోటు 158.46 టీఎంసీలవుతుంది. పోలవరం నీటిలభ్యత (హైడ్రాలజీ ఆమోదం ప్రకారం) 561టీఎంసీలు కాగా, సీతారామ డీపీఆర్‌లో 460.36టీఎంసీలు మాత్రమే అని ఉంది. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు పరిగణనలోకి తీసుకొన్న నీటి లభ్యతను ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకించింది. సీతారామ ఎత్తిపోతల వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. గోదావరిలో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించవద్దని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖలో పేర్కొన్నారు.

గాలేరు-నగరికి నికరజలాలను ఏపీ కోరలేదు

గాలేరు-నగరి ప్రధాన కాలువ 0- 56 కి.మీ. వరకు విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టారని, ఇందుకోసం రూ.305 కోట్లతో పరిపాలనా అనుమతి కూడా ఇచ్చారని తెలంగాణ(Water dispute between Telangana and AP) కృష్ణాబోర్డుకు తెలిపింది. ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులు ఎత్తిపోసి చెరువులను నింపడానికి మరో రూ.56.83 కోట్లతో పనులు చేపట్టారని బోర్డు దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లిస్తారని, అయితే పోతిరెడ్డిపాడు నుంచి 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవడానికి, వరద వచ్చినపుడు 11,150 క్యూసెక్కులు మళ్లించాల్సి ఉందని పేర్కొంది. కృష్ణా ట్రైబ్యునల్‌-2లో గాలేరు-నగరికి నికరజలాల కేటాయింపును కూడా ఆంధ్రప్రదేశ్‌(Water dispute between Telangana and AP) కోరలేదని తెలిపింది. ఈ నేపథ]్యంలో ప్రాజెక్టులో మార్పులు, విస్తరించడం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని, కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details