Telangana High Court : రౌడీషీట్లు తెరవడానికి ఓ విధానం అంటూ ఏమీలేదని, దాదాపుగా పోలీసు అధికారుల చిత్తానుసారం తెరుస్తున్నారని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క కేసు నమోదైతే చాలు రౌడీషీట్ తెరిచి దాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తుండటాన్ని తప్పుబట్టింది. రౌడీషీట్ తెరిచేందుకు అనుసరించే విధానమేమిటో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
Telangana High Court : ఇష్టమొచ్చినట్లు రౌడీషీట్లు తెరవడమేంటి..? - రౌడీ షీట్ తెరవడంపై తెలంగాణ హైకోర్టు
Telangana High Court : పోలీసులు తమ చిత్తానుసారం రౌడీషీట్లు తెరుస్తున్నారని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క కేసు నమోదైతే చాలు.. రౌడీషీట్ తెరిచి ఏళ్ల తరబడి కొనసాగిస్తుండటాన్ని తప్పుబట్టింది. రౌడీషీట్లు తెరవడానికి అనుసరించే విధానమేంటో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీకీ ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీసుస్టేషన్‌లో 2010 నుంచి కొనసాగిస్తున్న రౌడీషీట్‌ను ఎత్తివేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కావలి రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కన్నెగంటి లలిత ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.ఎల్.పాండు వాదనలు వినిపిస్తూ 2009లో రాజుపై ఓ కేసు నమోదైందని, 2010లో నిర్దోషిగా కోర్టు ప్రకటించిందన్నారు. అయినా రౌడీషీట్‌ను కొనసాగిస్తున్నారని, దీన్ని ఎత్తివేయాలంటూ గత ఏడాది ఫిబ్రవరిలో వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసు నియమావళి ప్రకారం నేరాలకు అలవాటుపడిన వారిపై రౌడీషీట్ తెరవచ్చన్నారు. పిటిషనర్‌పై ఎలాంటి కేసులు లేవంటున్న పోలీసులు 2010 నుంచి రౌడీషీట్ కొనసాగిస్తుండటంపై కౌంటరు దాఖలు చేయాలని డీజీపీని, పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.