ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం:తెలంగాణ మంత్రి ఈటల - covid vaccination 2021 in Hyderabad

తెలంగాణలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదట్లో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇస్తారని వెల్లడించారు.

minister etela rajender about covid vaccination
అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం:తెలంగాణ మంత్రి ఈటల

By

Published : Jan 16, 2021, 2:57 PM IST

అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం:తెలంగాణ మంత్రి ఈటల

ఇంతకాలం ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారిని టీకాతో తరిమికొడుతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు.

ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇస్తారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్య క్రమంలో అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్​పై పోరాటంలో వైద్యారోగ్య, పారిశుద్ధ్య కార్మికుల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

ABOUT THE AUTHOR

...view details