ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SCHOOL FEE: స్కూల్​ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు - telangana govt has order not to increase school fee for this academic year

తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచొద్దని ఆదేశించింది. బోధనా రుసుము మాత్రమే నెల వారీగా తీసుకోవాలని తేల్చి చెప్పింది. జీవోను ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

SCHOOL FEE
SCHOOL FEE

By

Published : Jun 29, 2021, 7:12 AM IST

ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఎలాంటి రుసుములను పెంచరాదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. జులై 1 నుంచి ఆన్​లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ తాజాగా జీవో 75 జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ పేర్కొంది. జీవో ఉల్లంఘిస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని.. ఇతర బోర్డులకు ఎన్ఓసీ ఉపసంహరిస్తామని జీవోలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ జీవో అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

సెట్​ పరీక్షల్లో మార్పుల్లేవ్​..

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సెట్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్​లోనే బోధించాలన్నారు. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. దూరదర్శన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జులై 1నుంచి ఆన్​లైన్​ పాఠాలు

విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం వాయిదా వేసింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులకు కొన్నాళ్ల పాటు ఆన్​లైన్ పాఠాలే చెప్పనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 1 నుంచి కేజీ నుంచి రెండో తరగతి విద్యార్థులు మినహా మిగిలిన వారికి ఆన్​లైన్ భోదన ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి మిగిలిన వారికీ ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా జీవో 46 ప్రకారం కేవలం బోధన రుసుములు.. మాత్రమే అది కూడా నెలవారీగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన ప్రవేశ పరీక్షలతో పాటు.. వచ్చే నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'శాశ్వతంగా భూ హక్కు కల్పించేందుకే భూముల రీ సర్వే'

ABOUT THE AUTHOR

...view details