KCR Meets Arvind Kejriwal : ఉత్తరాది రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అంశాలపై చర్చలు జరిపారు. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన కేసీఆర్.. కాసేపు ముచ్చటించి అక్కడే భోజనం చేశారు. అనంతరం జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై ఇరువురు నేతల ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. తర్వాత దిల్లీ నుంచి చండీగఢ్ కేసీఆర్, కేజ్రీవాల్ బయల్దేరారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించనున్నారు. చండీగఢ్‌లో రైతులు, సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు ఇవ్వనున్నారు. 600 వందల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటుగా పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ పాల్గొననున్నారు. చండీగఢ్‌లోని ఠాగూర్ థియేటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు.
KCR Delhi Tour Updates : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 378 రోజుల పాటు రైతులు చేసిన ఉద్యమంలో 700 మంది కర్షకులు చనిపోయారు. ఇందులో 600 మంది రైతులు పంజాబ్‌కు చెందిన వారే ఉన్నారు. వారికి ఇవాళ కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజు.. తు ఉద్యమంలో పోరాడి మృతిచెందిన కర్షక కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ వారికి చెక్కులు అందజేయనున్నారు. ఇప్పటికే పంబాజ్ ప్రభుత్వం.. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల పరిహారం అందించింది.