ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రేపటినుంచే ఉపాధ్యాయులు, పాఠశాలల్లో సిబ్బందికి ఆర్థిక సాయం - private teachers

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండు వేల రూపాయల ఆర్థికసాయం అందనుంది. ఆ రాష్ట్రంలో మొత్తంగా 1,06,383 మంది ఉపాధ్యాయులు, 11,621 మంది సిబ్బంది లబ్ధి పొందనున్నారు.

government aid to teachers and staff from tomorrow, tomorrow onwards telangana teachers and school staff will get benefited
తెలంగాణలో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వ సాయం, రేపటి నుంచి పాఠశాల సిబ్బందికి ప్రభుత్వం ఆర్థిక సాయం

By

Published : Apr 19, 2021, 9:47 PM IST

తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి రేపట్నుంచి రెండు వేల రూపాయల ఆర్థికసాయం అందనుంది. నిన్నటి వరకు జిల్లా విద్యాశాఖాధికారుల ధ్రువీకరణ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 1,06,383 మంది ఉపాధ్యాయులు, 11,621 మంది సిబ్బంది వారి వివరాలు అందజేశారు. మొత్తంగా 1,18,004 మంది లబ్ధి పొందనున్నారు.

ఇదీ చదవండి:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా

రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఖరారు చేసిన ప్రకారం రేపట్నుంచి నాలుగు రోజుల పాటు నగదు సాయాన్ని అందించనున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఇచ్చిన వివరాల ప్రకారం వారి వారి బ్యాంకు ఖాతాల్లో రెండు వేల రూపాయల నగదును ఆర్థికశాఖ జమచేయనుంది. 21వ తేదీ నుంచి 25వరకు కుటుంబానికి 25 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు.

ఇదీ చదవండి:

మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details