ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పిల్లల ప్రాణాలతో ఆటలొద్దు...పాఠశాలల నిర్వహణ నిలిపివేయండి' - పాఠశాలల ప్రారంభంపై టీడీపీ కామెంట్స్

పేద పిల్లల ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదనే లెక్కలేని తనంతో ప్రభుత్వం పాఠశాలలను పున:ప్రారంభించిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. కరోనా కేసులు పెరుగుతున్నందున పాఠశాలల్లో తరగతుల నిర్వహణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు పేద విద్యార్థులందరికీ స్మార్ట్ ఫోన్​లు ఇవ్వాలని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సాకుగా కనిపించిన కరోనా పాఠశాలలు, వైన్ షాపులు తెరిచేందుకు ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు.

Tdp spokes person pattabhi
Tdp spokes person pattabhi

By

Published : Nov 7, 2020, 3:23 PM IST

పేద పిల్లల ప్రాణాలు పణంగా పెట్టి ప్రభుత్వం పాఠశాలలను పున:ప్రారంభించిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున పాఠశాలల్లో తరగతుల నిర్వహణను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పాఠశాలల ప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి. ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు పేద విద్యార్థులందరికీ స్మార్ట్ ఫోన్​లు ఇవ్వాలి. దిల్లీ ప్రభుత్వం ట్యాబ్​లు ఇస్తుంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్న ప్రభుత్వం ఎందుకు స్మార్ట్ ఫోన్​లు ఇవ్వలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు బూచిగా కనిపించిన కరోనా.. పాఠశాలలు, వైన్ షాపులు తెరిచేందుకు కనిపించదా. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు వాతలు పెడతారని కరోనాను సాకుగా చూపారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మొదటి పది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా పాఠశాలలు తెరవకుండా ఏపీలో మాత్రమే తెరవటం తొందరపాటు నిర్ణయం. తుగ్లక్ చర్యల వల్ల రోజుల వ్యవధిలోనే 800 మందికి పైగా ఉపాధ్యాయులు, 500 మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు" -కొమ్మారెడ్డి పట్టాభిరామ్ , తెదేపా అధికార ప్రతినిధి

పేద విద్యార్థికి కరోనా సోకితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేవని, లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందలేరని పట్టాభి అన్నారు. తొందరపాటు నిర్ణయంతో లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను పణంగా పెట్టారని విమర్శించారు. కరోనా ప్రారంభం నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే రాష్ట్రంలో 6 వేల మందికిపైగా చనిపోయారని ఆరోపించారు.

ఇదీ చదవండి

మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details