ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు' - ycp

రాజధానిపై ఒకసారి అవినీతి మరక, మరోసారి వరద బురద ఇలా రకరకాల ప్రకటనలు చేస్తూ చివరకు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నారని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాజధానిపై డిసెంబర్‌ 30, 2014 నాడే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగిందని...దానిని మీడియా ముందుంచారు.

'రాజధాని అంటే బొత్స వల్ల పారిపోయిన వోక్స్ వ్యాగన్ కంపెనీ కాదు'

By

Published : Sep 8, 2019, 7:44 PM IST

'రాజధాని అంటే బొత్స వల్ల పారిపోయిన వోక్స్ వ్యాగన్ కంపెనీ కాదు'
రాజధాని అంటే బొత్స అవినీతికి భయపడి పారిపోయిన పోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ కాదన్న విషయం బొత్స గుర్తుంచుకోవాలని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. డిసెంబర్‌ 30, 2014న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్​ను ఆయన మీడియాకు విడుదల చేశారు. గెజిట్‌ ఇవ్వకపోతే 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారని బొత్సను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేవి కూలగొట్టడం, రాష్ట్ర ప్రతిష్ఠను చెడగొట్టడం అనేవిధంగా సీఎం జగన్, మంత్రి బొత్స పోటీపడి మరీ పని చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి ప్రతిసారి వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణ ద్వారా రాజధాని అంశం తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నా.. ముఖ్యమంత్రి కనీసం వివరణ ఇవ్వకపోవటం బాధాకరమని సత్యప్రసాద్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details