'మండలి ప్రసారాలు నిలిపి.. నిజాలు బయటికి రాకుండా చేశారు' - tdp mlcs press meet
మండలిలో మంత్రుల వ్యవహారశైలిని తెదేపా ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఛైర్మన్ చేతిలోని కాగితాలు తీసుకుని చింపివేశారని ఆరోపించారు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా.. అధికార పక్షం వ్యవహరించిన తీరుపై తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మండలి ప్రసారాలు నిలిపేసి.. వాస్తవాలు బయటకు రాకుండా చేసింది అధికార పక్షమేనని అశోక్ బాబు విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటున్న మంత్రి బొత్స.. ముందుగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. తమ సభ్యులపై మంత్రులు దుర్భాషలాడారని మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ చేతిలోని కాగితాలు తీసుకుని చింపేశారని.. ఆయనపై మంత్రులు దుర్భాషలాడారని ఆరోపించారు. ఎంపీ విజయసాయికి మండలిలో ఏం పని అని.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన షరీఫ్ కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందన్నారు.