ప్రజా సమస్యలపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో తెదేపా బృందం ఇవాళ గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది.
గవర్నర్ అపాయింట్మెంట్ కోసం తెదేపా ఎదురు చూపులు - governor
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేయాలని గవర్నర్‌కు తెలుగుదేశం పార్టీ విన్నవించనుంది. దీనికి సంబంధించి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెదేపా తెలిపింది.
తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఫిర్యాదు చేయనుంది. అంతేకాకుండా ప్రభుత్వం విపరీతంగా అప్పులు తెస్తూ ప్రజలపై భారం పెంచుతోందని, తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి:బకాయిలు ఇవ్వకుండా ప్రకటనలు ఇస్తే రైతుల కడుపు నిండదు: చంద్రబాబు