ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్నాయుడు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది: తెదేపా - అచ్చెన్నాయుడు అరెస్టు నిరసన

అచ్చెన్నాయుడు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కక్ష సాధించుకునేందుకే అర్ధరాత్రి డిశ్చార్జ్‌ పేరిట హైడ్రామా నడిపారని ధ్వజమెత్తారు. మానవతా విలువలు మరిచి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడుతూ వైకాపా కుట్రలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

tdp-leaders-got-fire-on-acchennaidu-arrest-at-wednesday-midnight
అర్థరాత్రి అచ్చెన్న అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఆగ్రహం

By

Published : Jun 25, 2020, 6:52 PM IST

అర్థరాత్రి అచ్చెన్న అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఆగ్రహం

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వ తీరును తెలుగుదేశం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్టు చేసే ముందురోజే ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా.. వినకుండా వందల కిలోమీటర్లు తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని అనిశా కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పది రోజులు బెడ్‍ విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏమిటని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

"కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.ఇది కేసు విచారణా లేక బీసీ నేతపై హత్యాయత్నమా.. ?ఈ కేసులో చూపే అత్యుత్సాహం.. ల్యాండ్ మాఫియా, 108 అంబులెన్స్ కుంభకోణం, ఆవభూముల స్కామ్, ఇసుక మాఫియాపై ఎందుకు చూపించడం లేదు..? కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు.. న్యాయస్థానాల ముందు నిలబడాల్సి వస్తోంది. అధికారం ఉందికదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడుతూ వైకాపా కుట్రలను అడ్డుకుంటాం." - చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత

'న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించిఅచ్చెన్నాయుడిని అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి నిన్న అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జ్ ప్రయత్నాల వరకు ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా..? - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

'న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నా .. సీఎంజగన్ ధిక్కరించి వ్యవహరిస్తున్నారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది.' - నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

'చట్టం, ధర్మం, న్యాయం ప్రభుత్వ ఉక్కుపాదాల కింద నలిగిపోతోంది. అచ్చెన్నను అర్థరాత్రి బలవంతంగా తమ కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు చేసిన ప్రయత్నాలు దారుణం. ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని వినియోగించడం ఏ రకంగా సమంజసం?' - కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

'అచ్చెన్నాయుడు పట్ల ప్రభుత్వం అణిచివేత ధోరణి తగదు. ఏమాత్రం మానవతా విలువలు లేకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది'. - జవహర్, మాజీ మంత్రి

'ఏదో విధంగా అచ్చెన్నాయుడును జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనే తపన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ కక్షసాధింపు అర్ధరాత్రి డిశ్చార్జ్ డ్రామా తో మరోసారి బయటపడింది. తెదేపా నాయకులంతా స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమైతే ఉన్న జైళ్ళు సరిపోవు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు, డాక్టర్లు వత్తాసు పలకడమేమిటి?' - అమర్‌నాధ్‌ రెడ్డి, మాజీ మంత్రి

-

ఇదీ చదవండి:

అక్టోబర్​లో అవుకు టన్నెల్​ ద్వారా సాగునీరు.. సీఎం నిర్దేశం

ABOUT THE AUTHOR

...view details