ఏపీజెన్కో ఉత్తర్వులను రద్దు చేస్తూ..హైకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టువంటిదని తెదేపా నేతలు గల్లా జయదేవ్, మాజీ మంత్రి దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు. రాజధానిని మారిస్తే..అమరావతికి కేటాయించిన నిధులన్నీ వృథా అవుతాయని వివరించారు.
వరదను ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదు. 10 వేల ఎకరాలు నీట మునిగాయి. వరదలు మానవ తప్పిదమే. పంట నష్టంతో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమే.
రాజధాని విషయంలో మంత్రులు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ప్రధాని, కేంద్ర హోమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి అన్నారు. ఆ మాటల్ని భాజపా నేతలు వ్యతిరేకించారు. పెట్టుబడులకు అనుగుణంగా ఉండాలనే అమరావతిని ఎంపిక చేశాం. నిర్మాణం ఆగిపోవాలనే బొత్స ఆ విధంగా వ్యాఖ్యనించారు. ఇప్పటికీ ఖర్చు పెట్టిన నిధులన్నీ వృథానే కదా..! హైటెక్‌సిటీ నిర్మించాక చంద్రబాబు దిగిపోతే వైయస్సార్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆపలేదు..జగన్ ఈ విషయాలను గుర్తించాలి.
--- గల్లా జయదేవ్, గుంటూరు ఎంపీ.