తెదేపా నేత పట్టాభిరామ్... హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పట్టాభి తరపు న్యాయవాది కోరారు. ఈ అంశంపై రేపు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
అసలేమైంది..?
తెదేపా నేత పట్టాభిరామ్‌కు మేజిస్ట్రేట్ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండు విధించారు. సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదుచేసి పట్టాభిని అరెస్టు చేశారు. గురువారం ఉదయం విజయవాడ కొత్త ఆసుపత్రికి తీసుకొచ్చి, కొవిడ్ సహా పలు పరీక్షలు చేయించారు. అనంతరం మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. పట్టాభిపై ఐదు కేసులున్నాయని, ముఖ్యమంత్రిని దూషించారని, ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, అందువల్ల రిమాండ్ విధించాలని కోరారు.