ముఖ్యమంత్రి సహాయనిధి కుంభకోణంలో వైకాపా ఎమ్మెల్యే పాత్ర బయటపడటంతో గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు జరిపిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. తెదేపా హయాంలో నీతిగా అమలైన పథకాలన్నీ ప్రస్తుతం అవినీతిగా మారాయని ఆరోపించారు. జే-ట్యాక్స్‌తో వివిధ రకాలుగా ఏటా రూ.5వేల కోట్లు లూటీ చేస్తున్నారని అన్నారు. తెదేపా ప్రభుత్వం పథకాలన్నీ ఆర్టీజీఎస్ ద్వారా సమర్థంగా నిర్వహిస్తే, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి లంచాలమయం చేశారని మండిపడ్డారు. కుల, జనన ధృవీకరణ పత్రాలకు కూడా పేదల నుంచి లంచాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి డ్వాక్రా గ్రూప్ నుంచి యానిమేటర్ల ద్వారా రూ.2 వేల బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తెలిపారు.
'జే-ట్యాక్స్‌తో ఏటా ఐదు వేల కోట్లు లూటీ' - జే-ట్యాక్స్
వైకాపా పాలనపై తెదేపా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. పథకాలన్నీ అవినీతి మయంగా మారయని ద్వజమెత్తారు. జే-ట్యాక్స్‌తో రూ. 5వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. తెదేపా అమలు జరిపిన పథకాలకు పేరు మార్చి, జగన్ అవే పనులు చేస్తూ కాపీ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెదేపా పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్న జగన్‌ను అంతా కాపీ మాస్టర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకానికి ఇచ్చిన డబ్బును, పాఠశాల అభివృద్ధి పేరుతో వెనక్కి లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. కరోనా వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ ఎక్కడ వర్తింపజేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్‌లో రూ.300కోట్ల అవినీతి ఇప్పటికే నిరూపితమైందన్నారు. గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారుల వద్ద రూ.15వేల నుంచి రూ.50వేలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా