అమ్మలాంటి అమరావతికి సీఎం జగన్ మరణ శాసనం రాశారని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలను వేధించడం మొదలుపెట్టి ఏడాది కావొస్తోందని విమర్శించారు. 3 రాజధానుల నిర్ణయంతో మహిళకు కడుపు నిండా తిండి లేదు..కంటిపై కునుకు లేదన్నారు. మహిళల ఆర్తనాదాలు జగన్మోహన్ రెడ్డికి వినిపించటం లేదా అని ప్రశ్నించారు. జగన్ ఇంట్లో లక్షల కొద్ది సూట్‌కేసులు ఉంటే... ప్రజలపై లక్షల కేసులా అని నిలదీశారు.
జగన్మోహన్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి అని... మూడు రాజధానులకు మద్దతుగా ఫేక్ ఉద్యమం నడుపుతున్నారని విమర్శించారు. నకిలీ ఉద్యమానికి వైకాపా ఎమ్మెల్యేలు స్పాన్సర్ చేస్తున్నారన్నారు. ఎంపీ నందిగం సురేష్‌కి సొంత గడ్డపై మమకారం లేదని దుయ్యబట్టారు. మహిళల ఆత్మాభిమానం కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళలకు తమ పార్టీ తరపున సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.