ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ముఖ్యమంత్రి...విద్యార్థులకు విషమ పరీక్ష పెడుతున్నారు' - కొల్లు రవీంద్ర తాజా వార్తలు

పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్.. విద్యార్థులకు విషమ పరీక్ష పెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి సీఎంకు అందే ముడుపుల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నారనే అనుమానం ఉందని ఆయన అన్నారు.

మాట్లాడుతున్న తెదేపా నేత కొల్లు రవీంద్ర
మాట్లాడుతున్న తెదేపా నేత కొల్లు రవీంద్ర

By

Published : Apr 29, 2021, 7:42 PM IST

పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విద్యార్థులకు విషమ పరీక్ష పెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడారు. "తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి సీఎంకు అందే ముడుపుల కోసమే పరీక్షల నిర్వహిస్తున్నారనే అనుమానం ఉంది. ఆసుపత్రుల్లో వసతులు, ఆక్సిజన్ లేక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతుంటే, పరీక్షలు నిర్వహించాల్సిందేననే మొండిపట్టు సరికాదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయమే అయితే ఇప్పుడు పరీక్షలు పెట్టడం సరికాదని అంతా చెప్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పారిశుద్ధ్య కార్మికులు అందరిపైనా పరీక్షల ప్రభావం పడుతుంది. వీరిలో ఎవరైన కరోనా బారిన పడితే బాధ్యత ఎవరిది." అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details