మనిషిని మనిషిగా చూడటం జగన్ వదిలేశారని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగమొండితనాన్ని తిరుపతి పర్యటనలో నిరూపించుకున్నారని ఆరోపించారు. ఓట్లేసినందుకు ఎస్సీ, ఎస్టీలను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి పర్యటనలో పక్కన పెద్దిరెడ్డిని కూర్చోపెట్టుకున్న జగన్.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలబెట్టి అవమానించారని విమర్శించారు. సొంత పార్టీకి చెందిన ఎస్సీ ఎంపీ చనిపోతే వారి కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని ఆక్షేపించారు.
లౌకికవాదిగా ఉండాల్సిన బాధ్యత సీఎంపై ఉంది : మాజీమంత్రి జవహర్ - వైసీపీ ప్రభుత్వంపై జవహర్ కామెంట్స్
సీఎం జగన్... డిక్లరేషన్ విషయంలో మొండిగా ప్రవర్తించి వెంకటేశ్వరస్వామి భక్తులను అవమానించారని మాజీమంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసినందుకు ఎస్సీ, ఎస్టీలను వైకాపా వేధిస్తోందని ఆరోపించారు. ఒక ఎస్సీ ఎంపీ చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం వెళ్లకపోవడం బాధాకరమన్నారు.
మాజీమంత్రి జవహర్
వైకాపాలో ఉన్న ఎస్సీ నేతలు కనీసం గళం వినిపించి, జగన్ చేసేది తప్పని చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు. లౌకికవాదిగా ఉండాల్సిన బాధ్యత జగన్పై ఉందన్న జవహర్... డిక్లరేషన్ విషయంలో మొండిగా వెళ్లి వెంకటేశ్వరస్వామి భక్తులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :ఎస్పీ బాలు మృతి పట్ల ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం