రాజధానిని విశాఖకు మార్చేందుకే ప్రభుత్వం కరోనా కేసుల వివరాలు బయటపెట్టడం లేదని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు. ఏ జిల్లాలో ఎన్ని టెస్టులు చేశారో వివరాలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్నింటిలో కాసులు దండుకున్న ప్రభుత్వ పెద్దలు... ఆఖరికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తెచ్చిన ర్యాపిడ్ కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కరోనా పేరుతో ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం దారుణమన్నారు.
'రాజధానిని తరలించేందుకే కరోనా వివరాలు బయటపెట్టడం లేదు'
వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కరోనా కేసులు వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
tdp-leader-devineni-uma