BUDDHA: గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే.. కొత్తగా బీసీ మంత్రులు బస్సు యాత్ర అంటున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు "బాదుడే బాదుడు" స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైకాపా రద్దు చేసిందన్న బుద్ధా వెంకన్న.. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్.కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని హితవు పలికారు. జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలంతా తెదేపా పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తెదేపా బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఆర్.కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా? అని బుద్ధా ప్రశ్నించారు.
జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలు తెదేపా వెంటే : బుద్ధా వెంకన్న - తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న
BUDDHA: గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే.. బీసీ మంత్రులు బస్సు యాత్ర అంటున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలంతా తెదేపా పక్షానే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా బీసీలంతా తెదేపా పక్షానే ఉన్నారు