ఉన్మాద చర్యలతో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రజల్ని భయపెట్టి పాలించాలనుకోవటం అవివేకమని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు, అనుచరులపై రౌడీషీట్లు తెరవటాన్ని ఖండించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని..పోలీసులకు మరోసారి చివాట్లు తప్పవని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ను బెదిరించి, భయపెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని చూస్తున్నారని.. మండిపడ్డారు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలని హితవు పలికారు.
'నేతలను భయపెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని చూస్తున్నారా?' - ఏపీ తాజా వార్తలు
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు, అనుచరులపై రౌడీషీట్లు తెరవటాన్ని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఖండించారు. ఉన్మాద చర్యలతో ఉత్తరాంధ్ర ప్రజల్ని భయపెట్టి పాలించాలనుకోవటం అవివేకమని మండిపడ్డారు.
tdp leader budda